


ఏదంతో ఎవరికి ఎరుకా?
చివరికి మిగిలేదేదో ఎవరికి ఎరుకా?
నల్ల మబ్బుల్లో నీరెంతో కొండా కోనకి ఎరుకా?
కొండ పైన కురిసిన వానెంతో వాగుకి ఎరుకా?
వాగులోన నీరెంతో పైరుకు ఎరుకా?
పైరు మీద పంట రైతన్నకి ఎరుకా?
రైతన్న గుండెలోన దిగులు రామన్న కి ఎరుకా?
ఎరుపెక్కిన పైరుకు ఎరువెక్కడ దొరుకేనో ....
ఎరునాపంగ దూళ్ళకు మేతేమిటి చిక్కేనో.....
ఈడొచ్చిన బిడ్డకి జోడెక్కడ కుదిరేనో.....
రైతన్న గుండెలోన దిగులు రామన్న కి ఎరుకా?
రైతన్న గుండెలోన దిగులు రామన్న కి ఎరుకా?
No comments:
Post a Comment